![]() |
![]() |
.webp)
తెలుగు బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియళ్స్ కి అత్యధిక టీఆర్పీ రేటగ్ వస్తోంది. అయితే ఇందులో ప్రస్తుతం బ్రహ్మముడి టాప్ లో ఉండగా.. కృష్ణ ముకంద మురారి సెకెండ్, గుప్పెడంత మనసు సీరియల్ మూడవ స్థానంలో ఉన్నాయి. అయితే వీటిల్లో గుప్పెడంత మనసుకి గత మూడు సంవత్సరాలుగా ఫ్యాన్ క్రేజ్ ఉంది.
గుప్పెడంత మనసులోని రిషి, వసుధారల ప్రేమకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొదట డీబీఎస్టీ కాలేజీలో ఓ స్టూడెంట్ గా పరిచయం అయిన వసుధార.. అదే కాలేజీలోని జగతి మేడమ్ ని ఇంప్రెస్ చేసింది. కొన్ని రోజులకి అదే కాలేజీలో గోల్డ్ మెడల్ పొందిన మొదటి ర్యాంక్ స్టూడెంట్ గా అందరిచేత ప్రశంసలు పొందింది. ఇక మెల్లమెల్లగా వసుధార, రిషీల మధ్య గొడవలు, ఈగోలు వెరసి ప్రేమగా మారింది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అలా ఒకరినొకరు కొన్ని రోజులు ప్రేమించుకున్నాక జగతి మేడమ్ వారి ప్రేమని అంగీకారించింది. కొంతకాలం తర్వాత దేవయాని కొడుకు శైలేంద్ర ఎంట్రీ ఇచ్చాడు. అతడికి కాలేజీలో ఎండీ సీట్ మీద ఉన్న కోరికతో జగతి మేడమ్ ని చంపించేశాడు. ఇక తర్వాత తను ఎండీ అవుదామని అనుకుంటే రిషి వసుధారని ఏండీని చేశాడు. ఇక ప్రతీదానికి అడ్డుగా ఉన్న రిషిని రౌడీలతో కొట్టించాడు శైలేంద్ర.
ఇక తాజా ఎపిసోడ్ లలో గాయాలతో ఉన్న రిషిని చూపించిన డైరెక్టర్.. మరికొన్ని రోజులలో అతడు షూటింగ్ లో పాల్గొంటాడని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసి మరీ చెప్పాడు. అయితే ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ 1000 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. అయితే రిషి అలియాస్ ముఖేశ్ గౌడ ఈ అరుదైన ఘనతను పొందిన సందర్భంగా ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ ఓ పోస్ట్ చేశాడు. కాగా త్వరలోనే రిషి వస్తాడని ఎదురుచూస్తున్న గుప్పెడంత మనసు ప్రేక్షకుల కల నెరవేరుతుందని అందరు కోరుకుంటున్నారు. కాగా వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సీరీయల్ యూనిట్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
![]() |
![]() |